ఎన్ఆర్ఐ భూమి కబ్జాపై పోలీసుల వేధింపుల పర్వం
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: గన్నవరం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అమెరికా నివాసి, ఎన్ఆర్ఐ మహిళ డాక్టర్ వేదాంతం శాంతకు చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమి వివాదంలో స్థానిక పోలీసుల జోక్యం తీవ్ర కలకలం రేపుతోంది. తన పేరుపై రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్బుక్లు ఉన్నప్పటికీ, గత పదిహేనేళ్లుగా భూమిని కౌలు చేస్తున్న అప్పారావును గన్నవరం పోలీసులు బెదిరించి తప్పుడు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 8న ఫిర్యాదు చేసినా, పోలీసులు కౌలుదారుపై ఒత్తిడి తెచ్చి భూమిలోకి వెళ్లబోమంటూ బలవంతపు ప్రకటన తీసుకున్నారని ఆమె వాపోయారు. స్థానిక పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కాకుండా తన ఆస్తి హక్కులను రక్షించాలని ఆమె ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.