అయ్యగారు ట్యాగ్ నాకే చెందుతుంది: హీరో సుమంత్ సరదా కామెంట్స్

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

అక్కినేని హీరో సుమంత్ తన తాజా సినిమా మహేంద్రగిరి వారాహి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీలో పెద్ద మనవడినైన తనకే 'అయ్యగారు' ట్యాగ్ హక్కుంటుందని సరదాగా చమత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల్ నటనను, ఇటీవల వచ్చిన 'లెనిన్' చిత్రంలో ఆయన పరిణతిని సుమంత్ ప్రత్యేకంగా ప్రశంసించారు.