గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట: ఓటీపీ నిబంధన తాత్కాలికంగా ఎత్తివేత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
గ్యాస్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. నెట్వర్క్ సమస్యల కారణంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీలో తలెత్తుతున్న జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఓటీపీ ధృవీకరణ నిబంధన నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చారు. ఈ నూతన విధానంతో వినియోగదారులు ఓటీపీ చూపించాల్సిన అవసరం లేకుండానే నేరుగా నగదు చెల్లించి సులభంగా సిలిండర్లు పొందవచ్చని పేర్కొన్నారు.