జనసైనికుల కుటుంబాలకు ఐదు లక్షల బీమా చెక్కుల అందజేత

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Mangalagiri

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన ఐదుగురు క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు. అలాగే గాయపడిన ఆరుగురు జనసైనికులకు కలిపి మొత్తం రూ.27,21,262 విలువైన బీమా చెక్కులను స్థానిక నాయకుల సమక్షంలో బాధిత కుటుంబాలకు అందించినట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి జనసైనికుడి కుటుంబానికి అండగా నిలవడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు.