గణేష్ మండపాల ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఉత్సవ నిర్వాహకులు ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారం ఇస్తే బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసులకు సులువవుతాయని ఆయన తెలిపారు.