ఒక్క తట్ట మట్టి ఎత్తలేదంటూ మాజీ మంత్రులకు గన్నవరం ఎమ్మెల్యే సవాల్
రిపోర్టర్: శివ
స్థలం: కృష్ణా
గన్నవరం నియోజకవర్గంలో ఒక్క తట్ట మట్టి ఎత్తలేదంటూ దైవం సాక్షిగా ప్రమాణం చేయాలని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానికి ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూటిగా సవాల్ విసిరారు. అభివృద్ధి పనులపై తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ రాజకీయ విమర్శలపై మాజీ మంత్రులు లేదా వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన తెలపలేదు.