వాహనదారులకు చేరని ఆర్సీ బుక్కులు.. ఏజెంట్ల చేతివాటం!

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో పోస్టల్ సేవలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. వాహనదారులకు పోస్టల్ ద్వారా చేరాల్సిన ఆర్సీ బుక్కులు, డ్రైవింగ్ లైసెన్సులు చిరునామాలు సక్రమంగా లేవనే పేరుతో ఓ ప్రైవేట్ ఆర్టీవో ఏజెంట్ వద్ద ఉంచుతున్నట్లు తేలింది.

పోస్టల్ ట్రాకింగ్లో మాత్రం పత్రాలు డెలివరీ అయినట్లుగా తప్పుగా నమోదు చేస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సదరు ఏజెంట్ లబ్ధిదారుల నుంచి అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.