చాట్నేహళ్లిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన మంత్రాలయం ఎస్ఐ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంత్రాలయం

మంత్రాలయం మండలం చాట్నేహళ్లి గ్రామంలో ఎస్ఐ గ్రామ పెద్దలతో సమావేశమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులు, మోసపూరిత కాల్స్ నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దని సూచించారు. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై కూడా అవగాహన కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దల సహకారం కోరారు. గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు.