ఇచ్ఛాపురం పోరులో క్లీన్ స్వీప్ తో కదంతొక్కిన అధికార కూటమి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురంలో ఇరవై ఎనిమిది వార్డులకు కౌంటింగ్ పూర్తయింది. ఈ ఫలితాల్లో తెలుగుదేశం పదిహేడు, వైయస్సార్ కాంగ్రెస్ ఐదు, జనసేన నాలుగు, స్వతంత్రులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం ఇరవై ఎనిమిది వార్డులకు కూటమి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి.