కూటమి ప్రభుత్వ పాలనలో పల్లెల్లో వెల్లువెత్తుతున్న సంక్షేమ పథకాల జయయాత్ర
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని 87వ వార్డు మీ-సేవ ప్రాంగణంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం గారు విచ్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.