కర్నూలులో అరుదైన పంచలింగాల క్షేత్రం: ప్రత్యేకతలు వెల్లడించిన ఆలయ పూజారులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీతీరంలో కొలువై ఉన్న పంచలింగాల క్షేత్రం అత్యంత పురాతనమైనదని ఆలయ పూజారులు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై ఐదు శివలింగాలు వెలయడం ఇక్కడి ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. జనమేజయ మహారాజు సర్పయాగ దోష నివారణ కోసం ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోందని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంతం విశేష ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు.