తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు గజవాహనంపై మలయప్పస్వామి దర్శనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై, సాయంత్రం స్వర్ణరథంపై, రాత్రి గజవాహనంపై మలయప్పస్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.