'తానే చనిపోయినట్లు తప్పుడు వార్త': ఒంగోలులో విద్యార్థి వీరంగం
రిపోర్టర్: హరి
స్థలం: ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆన్‌లైన్ న్యూస్ యాప్‌లో తన వార్తలు రావడంలేదనే అక్కసుతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తప్పుడు వార్తను స్వయంగా పంపాడు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థి మృతి చెందినట్లు వచ్చిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్నేహితులు, కాలేజీ యాజమాన్యం మరియు పోలీసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులను విచారించగా అసలు నిజం బయటపడటంతో, పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించి హెచ్చరించి పంపించారు.