నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ రైల్వే కోడూరులో ధర్నా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో పాటు పలువురు పార్టీ ప్రతినిధులు పాల్గొని తమ నిరసనను గట్టిగా తెలియజేశారు.