టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులంటూ కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశంస
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
దేశంలో టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేస్తూ డిజిటల్ భారత్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను మెరుగుపరిచామని పేర్కొన్నారు. టెలికం రంగంలో చేపట్టిన సమూల సంస్కరణల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాంకేతిక రంగంలో అసాధారణ వృద్ధిని సాధించిందని ఆయన స్పష్టం చేశారు.