దేవాలయ నిర్మాణానికి అభయమిస్తూ చిగురించిన దాతృత్వపు హృదయం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో నిర్మించనున్న బంగారు మైసమ్మ, పాపమ్మ దేవాలయాల నిర్మాణానికి రాజీవ్ గాంధీ ట్రస్ట్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి ఆర్థిక సాయం అందించేందుకు హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో దేవాలయ కమిటీ సభ్యులు, కుల పెద్దలు కలిసి ఆలయ నిర్మాణ వివరాలను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారం అందిస్తానని తెలపడంతో కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.