భక్తిపారవశ్యంతో పులకించిన వేంకటేశ్వరుని సప్తగిరి శిఖరాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సిద్దిపేట

సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అహోబిలం రామానుజ జీయర్ స్వామి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం జీయర్ స్వామికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు, ఆలయ ఈవో మారుతి, చైర్మన్ నగేష్, అర్చక స్వాములు మరియు వికాస తరంగిణి భక్తులు పాల్గొన్నారు.