ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో తాత్కాలిక ఊరట కల్పించిన న్యాయస్థానం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఖాతాల్లో ఉన్న సుమారు మూడు కోట్ల రూపాయల నిధులను విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రం అనుమతి లేదని తేల్చిచెప్పింది. కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నానని రవి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.