సంచలన సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ: విజయవాడలో సీన్ రీకన్స్ట్రక్షన్
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
సంచలనం సృష్టించిన సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అన్ని దస్త్రాలను అధికారికంగా స్వాధీనం చేసింది. నేటి నుంచి సీబీఐ బృందం విజయవాడలో మకాం వేసి నేరస్థలాన్ని పరిశీలించనుంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల స్టేట్మెంట్లు, నిందితుల రిమాండ్ రిపోర్టులను అందజేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.