పుత్తూరులో ట్రాఫిక్ కష్టాలతో అల్లాడిపోతున్న వాహనదారులు మరియు ప్రయాణికులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుత్తూరు

పుత్తూరు పట్టణంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకే ట్రాఫిక్ కష్టాలు తారస్థాయికి చేరాయి. ప్రధాన రహదారులు, కూడళ్లలో వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజురోజుకు పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, రద్దీ సమయాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.