నిజామాబాద్‌లో హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు
రిపోర్టర్: గోపి
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైష్ణవిని హత్య చేసిన హరిబాబును తానే అంతం చేసినట్లు ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. చెల్లి మరణానికి ప్రతీకారంగానే ఈ హత్య చేశానని, తాను నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నానని సంతోష్ ఆ వీడియోలో స్పష్టం చేయడంతో నిజామాబాద్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.