కాకినాడలో గణేష్ ఉత్సవాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన ఎస్పీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Kakinada, Andhra Pradesh

కాకినాడ జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ జి. బిందు మాధవ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను (ganeshutsav.net) అందుబాటులోకి తెచ్చారు. మండపాల అనుమతులు, నిమజ్జన మార్గాలు, పోలీసు మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్వాహకులు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. పండుగను సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.