అమెరికాలో కలకలం: వైట్ హౌస్ సమీపంలో డొనాల్డ్ ట్రంప్ హత్యకు యత్నం
రిపోర్టర్: హరి
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చేందుకు కుట్ర పన్నిన రోనీ యోర్డ్రిక్స్ గువానిపా క్రిరినోస్ ను వైట్ హౌస్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. నిందితుడి వద్ద మూడు అగ్నిఆయుధాలు, భారీ సంఖ్యలో తూటాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అసాధారణంగా ప్రవర్తిస్తున్న అతడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది గురువారం రాత్రి అరెస్ట్ చేశారని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.