కాంతుల పండుగతో ప్రతి ఇంటా సరికొత్త వెలుగులు నిండాలి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: రాజేంద్రనగర్

తెలంగాణ రక్షణ సేన తరఫున రాష్ట్ర ప్రజలందరికీ పూజారి ప్రవీణ్ కురుమ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భద్రతా జాగ్రత్తలతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.