బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ ఆఫర్లు: తక్కువ వడ్డీకే గృహ, కార్ రుణాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను ప్రకటించినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. బాబ్ కే సంగ్ త్యోహార్ కీ ఉమంగ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా 7.40 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు రద్దుతో పాటు ఇవి కార్ లోన్లపై అదనపు వడ్డీ తగ్గింపు మరియు డెబిట్ కార్డు కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు కల్పిస్తున్నట్లు వివరించారు.