వాషింగ్టన్‌కు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్ పయనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: వరల్డ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్ పర్యటనను అకస్మాత్తుగా ముగించి వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లారు. ఈ సమయంలోనే క్యాంప్ డేవిడ్ సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ఒక విమానం ప్రవేశించడంతో ఎఫ్-16 యుద్ధ విమానాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ట్రంప్‌నకు ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.