మేడ్చల్ మల్కాజిగిరి: సైబరాబాద్ లో పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన వీడ్కోలు

రిపోర్టర్: గోపి స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికినట్లు సైబరాబాద్ పోలీస్ వెల్లడించారు. పోలీస్ శాఖకు వారు అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, వారి భవిష్యత్తు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండాలని కమిషనర్ ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని రిటైర్డ్ అధికారులకు శుభాకాంక్షలు తెలుపగా, సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక జ్ఞాపికలను అందించడం జరిగింది.