షెడ్యూల్ ప్రకారమే భారత్-అఫ్ఘానిస్తాన్ తొలి టీ20 మ్యాచ్

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13న జరగాల్సిన భారత్-అఫ్ఘానిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ ఎటువంటి మార్పు లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాలరీత్యా మ్యాచ్ తేదీ మారుతుందని ప్రచారం జరిగినప్పటికీ, పోలీసుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయని డీడీసీఏ స్పష్టం చేసింది.