ప్రముఖ హాలీవుడ్ నటుడు గెరిట్ గ్రాహం కన్నుమూత

రిపోర్టర్: కృష్ణ స్థలం: New York

ప్రముఖ హాలీవుడ్ నటుడు గెరిట్ గ్రాహం తన 76వ ఏట న్యూయార్క్ లో కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 15న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫాంటమ్ ఆఫ్ ది ప్యారడైజ్ వంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.