ఆదివాసీ మహిళల ఉజ్వల భవిష్యత్తుకై ఉచిత టైలరింగ్ శిక్షణ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అరకు వ్యాలీ

అరకువేలి మండలంలోని కొర్రాయి కొత్తవలస గ్రామంలో గురుదేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలకు నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బీసీవై అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ ఎల్ఎల్బీ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధి కల్పనకు ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ సర్టిఫికెట్ల ద్వారా మహిళలు ప్రభుత్వ పరంగా అందే ఆర్థిక రుణాలకు అర్హత సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సూపర్వైజర్ కె. చిన్నారి, వాలంటీర్లు, స్థానిక నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.