అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ ఆల్ రౌండర్ సిమ్రాన్ జీత్

రిపోర్టర్: రమేష్ స్థలం: Mohali

తీవ్రమైన కాలేయ వైఫల్యం బారినపడి కోలుకున్న ఐర్లాండ్ క్రికెటర్ సిమ్రాన్ జీత్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికానని బుధవారం వెల్లడించారు. తన ఇరవయ్యేళ్ల క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మోహాలిలో తాను కొత్త క్రికెట్ అకాడమీని ప్రారంభించినట్లు సిమ్రాన్ జీత్ సింగ్ తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగానే ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.