వేమనపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత సామగ్రి పంపిణీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వేమన్పల్లి
వేమనపల్లి మండలంలోని నీల్వాయి కస్తూర్బా విద్యాలయం, వేమనపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వచ్చిన ఉచిత దుస్తులు, బ్యాగులు, షూస్లను మాజీ జడ్పీటీసీ సభ్యులు రుద్రబట్ల సంతోష్ కుమార్, మండల విద్యాధికారి శ్రీధర్ రెడ్డితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి మధు, స్పెషల్ ఆఫీసర్ మాయూరి, వేమనపల్లి సర్పంచ్ ఉప్పలపు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.