రోడ్డెక్కిన మురికి నీరు చెరువును తలపిస్తున్న ఏలేశ్వరం మార్గం
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ఏలేశ్వరం
ఏలేశ్వరం-ఎర్రవరం ప్రధాన రహదారిపై తిరుమాలి రోడ్డు సమీపంలో వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వసతి లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించాలని, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.