మర్రిపాడులో చెరువు కబ్జా.. అధికారుల నిమ్మకు నీరెత్తిన తీరు!
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండలంలోని పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం భూమిని కొందరు బడాబాబులు కబ్జా చేస్తున్నారు. సర్వే నంబర్లు 112, 113 పరిధిలో సుమారు 10 ఎకరాలకు పైగా చెరువు భూమిని జేసీబీలతో చదును చేస్తూ, అక్రమంగా ఆక్రమిస్తున్నారని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
చెరువు కట్టను తొలిచి, తూములను పూడ్చివేస్తున్నా ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.