నెల్లూరులో వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లాలో మండపాల ఏర్పాటుకు పోలీసు శాఖ ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి చేసింది. సింగిల్‌ విండో విధానంలో ganeshutsav.net పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే క్యూఆర్‌ కోడ్‌ను మండపం వద్ద విధిగా అంటించాలి. నిబంధనల ప్రకారం ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.