దేశవ్యాప్తంగా మూడు వందల పదహారు జిల్లాల్లో శ్రమ సంవాద్ కార్యక్రమం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతనఢిల్లీలో శ్రమ సంవాద్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నూతన కార్మిక చట్టాల అమలుపై కార్మికులు, యజమానులతో పాటు వివిధ వర్గాల భాగస్వాములతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. దేశంలోని ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మూడు వందల పదహారు జిల్లాల్లో తొంభై రోజుల పాటు ఈ బృహత్తర మెగా అవగాహన ప్రచారం కొనసాగుతుందని తెలిపారు.