నెల్లూరులో వినూత్న ప్రలోభాలు: ఒక్కో ఓటుకు కేజీ చికెన్ ఉచితమంటూ ప్రచారం
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వినూత్న మార్గాలు ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఓటర్లకు ఒక్కో స్లిప్పునకు కేజీ చికెన్ ఉచితంగా పంపిణీ చేశారు. శని, ఆదివారాల్ లో ఈ అవకాశం ఉంటుందని చెప్పడంతో వెంకటేశ్వరపురం కాలనీలోని దుకాణం కిక్కిరిసిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చికెన్ దుకాణాన్ని మూసివేయించినట్లు అధికారులు తెలిపారు.