రైజ్ అండ్ ఫాల్ సీజన్ రెండులోకి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్

రిపోర్టర్: విజయ్ స్థలం: బీహార్

బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రముఖ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్ సీజన్ రెండులో అడుగుపెట్టనున్నారు. భోజ్‌పురి బవాల్ తర్వాత ఆయన ఈ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షోకు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సెప్టెంబర్ 26 నుండి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.