'స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం': కాణిపాకంలో అంగరంగ వైభవంగా వేడుకలు

రిపోర్టర్: సతీష్ స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు ధ్వజారోహణం నిర్వహించి, సకల దేవతలను ఆహ్వానిస్తూ మూషిక పటాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక అభిషేకాలు, నివేదన అనంతరం మహా మంగళ హారతులిచ్చారు. ఈ వేడుకల్లో ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ వి.మణినాయుడు, ఈవో పెంచలకిశోర్, ఉభయదారులు, పాలకమండలి సభ్యులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.