గణేష్ ఉత్సవాల వేళ డీజేలపై పోలీసుల నిఘా

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తఖియుద్దిన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజే ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో గణేష్ నిమజ్జనం, ఉత్సవాల నిర్వహణపై పలు కీలక సూచనలు చేస్తూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.