రాజ్ ఠాక్రేను కించపరిచిన ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఎంఎన్‌ఎస్ స్టైల్లో బుద్ధి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Maharashtra
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేను కించపరుస్తూ సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేసిన పూణేకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ మహేష్ మోటేకు ఎంఎన్ఎస్ కార్యకర్తలు తమదైన శైలిలో గుణపాఠం చెప్పారు. పార్టీ కార్యాలయానికి లాకెళ్లిన కార్యకర్తలు రాజ్ ఠాక్రే ఫోటో ముందు అతడితో సాష్టాంగ నమస్కారం చేయించి, ముఖానికి నల్ల సిరా పూసి, తలపై చెప్పులతో గుంజీలు తీయించి క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.