రేపల్లెలో నూతన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి ఆనగాని సత్య ప్రసాద్

రిపోర్టర్: శివ స్థలం: బాపట్ల

రేపల్లె ప్రజల చిరకాల కోరికైన వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఒకటో తేదీ ఉదయమే ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే ఆనగాని సత్య ప్రసాద్ తెలిపారు. పట్టిసీమ జలాలతో సాగునీరు అందిస్తూ భవిష్యత్తులో పోలవరం ద్వారా రెండు పంటలకు నీళ్లిచ్చేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వెల్లడించారు. అలాగే వంద ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.