సంవత్సరంలోపే ఇందిరమ్మ టవర్స్ తాళాలు లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి పొంగులేటి హామీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

అరవై రోజుల్లోగా లేదా ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ తాళాలు అర్హులైన లబ్దిదారులకు అందజేసే పూర్తి బాధ్యత తనదేనని పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఖమ్మంలో పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా, దరఖాస్తుదారుల సమక్షంలోనే డ్రా పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఏళ్ల తరబడి ఎన్నికల కోసం ఎదురుచూసే పరిస్థితి లేకుండా లబ్దిదారులకు ఇండ్లు ఇస్తామని తెలిపారు.