కాసులపల్లిలో నూతన మహన్య ఫెర్టిలైజర్ ప్రారంభించిన మనోహర్ రెడ్డి
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహన్య ఫెర్టిలైజర్ ను మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యజమాని రాకేష్ ను అభినందించి, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజశేఖర్, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, నాయకులు ముత్యాల రాజయ్య, అనంతరెడ్డి, బాపు, ఉప సర్పంచ్ వేల్పుల హరీష్, మహేంద్ర రెడ్డి, మల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.