కొడుకుల కంటే కూతుళ్లు ఉన్నవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
కొడుకులు మాత్రమే ఉన్నవారితో పోలిస్తే కూతుళ్లు ఉన్న తల్లిదండ్రుల్లోనే సంతోష స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు చైనాలో జరిగిన ఒక సరికొత్త అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు ఝాంగ్ ఫీ తెలిపారు. ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో ఈ ఆనందం ఇంకా ఎక్కువగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. వృద్ధాప్యంలో భావోద్వేగ తోడ్పాటు, ఆలనాపాలన విషయంలో కొడుకుల కంటే కూతుళ్ల ద్వారానే మెరుగైన మద్దతు లభిస్తోందని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైందని నిపుణులు విశ్లేషించారు.