మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్కు ది ప్యారడైజ్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు వారు పేర్కొన్నారు. తొలి రోజు ఎది ఎనిమిది కోట్ల వసూళ్లు రాబట్టగా, రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఈ చిత్రంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.