అనకాపల్లి జిల్లాలో నూతిలో పడి ప్రేమజంట మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నూతిలో పడి యువ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను డొంగల కన్సిక సత్యసాగర్, షీలా అరుణగా గుర్తించారు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వివాహానికి అరుణ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో గతంలో పలుమార్లు ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.