స్నేహితుడిని హత్య చేసి కలలో భయపెట్టడంతో లొంగిపోయిన నిందితుడు

రిపోర్టర్: కృష్ణ స్థలం: థానే

మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలిలో మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన నిందితుడు ఇరవై రోజుల తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతుడు విశాల్ కదమ్, నిందితుడు ప్రభు కరకాడే ప్రాణ స్నేహితులు కాగా, మద్యం సేవించే సమయంలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఈ హత్య జరిగింది. మృతదేహాన్ని పారేయడంలో సహకరించిన ఇంటి యజమాని సందేష్ మాత్రేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నిరంతరం వెంటాడిన కలల కారణంగానే అతడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.