బ్యాంకుల మూడు రోజుల సమ్మె వాయిదాతో నేడు యథావిధిగా కార్యకలాపాలు

రిపోర్టర్: శివ స్థలం: దిల్లీ

బ్యాంకుల మూడు రోజుల సమ్మె వాయిదా పడినట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్తో జరిగిన చర్చలు ఫలించడంతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఐదు రోజుల పని దినాలపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఖాతాదారులకు ఏర్పడాల్సిన ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి.