నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కూటమి అభ్యర్థి విజయలక్ష్మి విజయమే లక్ష్యంగా ప్రచారం

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఆదిత్యనగర్ మరియు రాంజీనగర్ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల గారి విజయమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించాయి. రాబోయే ఎన్నికలలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను అభ్యర్థించారు. గత ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వంలో వేగవంతం చేస్తామని ప్రచారంలో స్పష్టం చేశారు.